Saturday, January 28, 2012

Idigo bhadradhri gauthami song lyrics

ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి

1.ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు
కలసి కొలువగ రఘుపతి యుండెడి 11ఇదిగో11

2.చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సుందర మై యుండెడి 11ఇదిగో11

3.అనుపమానమై అతి సుందర మై
దనరు చక్రము ధగ ధగ మెరిసెడి 11ఇదిగో11

4.కలి యుగమందున ఇల వైకుంటము నలరు చున్నది నయముగ మ్రొక్కుడి 11ఇదిగో11
5.పొన్నల పొగడల పూ పొదరిండ్లను
చెన్ను మీగడను స్రింగారం బడు 11ఇదిగో11

6.శ్రీ కరముగ రాందాసును
ప్రాకట ముగ బ్రోచే ప్రభు వాసము 11ఇదిగో11