Tuesday, December 20, 2011

jagadapu janavulu jaajara song lyrics

జగడపు జనవుల జాజర
సగివల మంచపు జాజర


మొల్లలు దురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన బుప్పొడి జాగర బతిపై
చల్లే రతివలు జాజర ll jagadapu ll


భారపు కుచముల పైపైగడు సిం-
గారము నెరపెటి గంధవొడి
చేరువ పతిపై చిందగ బడతులు
సారెకు జల్లేరు జాజర ll jagadapu ll


బింకపు గూటమి పెనగేటి చమటల
పంకపు పూతలపరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమదంబుల జాజర ll jagadapu ll

No comments: