Saturday, October 22, 2011

itu garudani neevekinanu - annamacharya keerthana- telugu

ఇటు గరుడని నీ వెక్కినను
పటపట దిక్కులు బగ్గన బగిలె

ఎగసినగరుడని యేపున ’థా’యని
జిగిదొలకచబుకు చేసినను
నిగమాంతంబులు నిగమసంఘములు
గగనము జగములు గడ గడ వడకె

బిరుసుగ గరుడని పేరెము దోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస నిఖిలములు జర్జరితములై
తెరుపున నలుగడ దిరదిర దిరిగె

పల్లించిననీపసిడిగరుడనిని
కెల్లున నీ వెక్కినయపుడు
ఝల్లనె రాక్షససమితి నీమహిమ-
వెల్లి మునుగుదురు వేంకటరమణా



No comments: